![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు తాప్సీ పన్ను. బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతు 'గాంధారి' తో సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటిటిలో అడుగుపెట్టబోతుంది.ఇప్పుడు ఈ మూవీకి కాపీరైట్ ఆరోపణలు, కథా చౌర్యం వివాదాలు చుట్టుముట్టాయి. కణికా ధిల్లాన్ నిర్మాణం మరియు రచనలో, దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ పన్నా 'బానీ' అనే శక్తివంతమైన తల్లి క్యారక్టర్ పోషించారు. కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి పోరాడే ఒక తల్లి భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర ముఖ్య కథాంశం.
గాంధారి కథపై ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సెంట్రల్ జీఎస్టీ ,కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణ్ బండి మాట్లాడుతూ '2019లో 'గాంధారి' అనే పేరుతో ఒక కథని పూర్తి చేసి, దానిని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA)లో అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నాను. 2019 లోనే లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా అప్పట్లో 'వూట్' (Voot) డిజిటల్ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న మోనికా షెర్గిల్‌ను సంప్రదించి, కథకి సంబంధించిన 8 పేజీల సమగ్ర వివరణతో పాటు 2 పేజీల కథా సారాంశాన్ని (Synopsis) ఆన్లైన్ ద్వారా పంపించాను. చైల్డ్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కుకున్న తన సంతానాన్ని కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే సాహసోపేతమైన పోరాటమే నా కథలోని ప్రధాన ప్లాట్. 'గాంధారి' సినిమా కాన్సెప్ట్, శీర్షిక మరియు ఆత్మ తన రిజిస్టర్డ్ కథతో 100% సరిపోలుతున్నాయని కళ్యాణ్ బండి చెప్తున్నారు.
Also read: ఇరుముడి మణమ్మ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. తండ్రి లేడు
మరొ వైపు ముంబైకి చెందిన రచయిత రాఘవ్ దేశాయ్ కూడా 2024లో తాను పిచ్ చేసిన స్క్రిప్ట్‌ను కాపీ చేసి కణికా ధిల్లాన్ పేరుతో వాడుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ఈ తీవ్రమైన ఆరోపణలపై గాంధారి చిత్ర నిర్మాణ సంస్థ 'కథా పిక్చర్స్' (Kathha Pictures) అధికారికంగా స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. సామాజిక మాధ్యమాలు మరియు కొన్ని పత్రికల్లో వస్తున్న కాపీరైట్ వ్యాఖ్యలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అబద్ధాలని సంస్థ స్పష్టం చేసింది. 'గాంధారి' అనేది రచయిత్రి కణికా ధిల్లాన్ స్వయంగా సృష్టించిన సొంత ఆలోచన అని, దీని కథ మరియు స్క్రీన్‌ప్లే పూర్తిగా ఆమె ఒరిజినల్ వర్క్ అని వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేని ఇటువంటి వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కోరింది. సెప్టెంబర్ 3 విడుదల సమయానికి ఈ కాపీ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Taapsee Pannu, Gandhari, Kanika Dhillon, Kalyan Bandi

![]() |
![]() |